తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురి మృతి 
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,603
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34,665
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,69,407కి పెరిగింది. ఇప్పటి వరకు 7,30,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,094 మంది మృతి చెందారు.  


Telangana
Corona Virus
Updates

More Telugu News